Oct 13,2023 21:14

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌

ప్రజాశక్తి - పాలకొండ :  మండలంలోని గోపాలపురంలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, మండలి విప్‌ పాలవలస విక్రాంత్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తుల వద్దకు సుపరిపాలన అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సేవల కోసం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకొని, సేవలు పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బొమ్మాళి భాను, వైస్‌ ఎంపిపిలు కణపాక సూర్య ప్రకాశరావు, వాకముడి అనిల్‌, రణస్థలం రాంబాబు, వారాడ దుర్గారావు, వారాడ చంద్రశేఖరరావు, సవిరిగాన చిన్నికృష్ణ, సవిరిగాన పెద్దకృష్ణంనాయుడు తదితరులు పాల్గొన్నారు.