ప్రజాశక్తి- దొనకొండ : వ్యవసాయానికి ఇచ్చే 9గంటల విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయాలని కోరుతూ మండల పరిధిలోని పెద్దన్న పాలెం గ్రామ రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పురుగుల మందుల డబ్బాలతో ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి ఇచ్చే 9 గంటల విద్యుత్‌ను సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. దీంతో తాము లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నట్లు తెలిపారు. 9 గంటలకు పేరుతో 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌లో అంతరాయం వల్ల మోటారు కాలిపోతున్నట్లు తెలిపారు. విద్యుత్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక రాంత్రిభవళ్లు పొలాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 9 గంటల పాటు నిరంతం విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యుత్ ఎఇ షేక్ నాగూర్ మాట్లాడుతూ పెద్దన్నపాలెం రైతులకు సరఫరా చేస్తే విద్యుత్ లైన్‌లో సాంతికేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించి పగటి పూటి ఏడు గంటలు, రాత్రి పూట రెండు గంటల పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు.










