ప్రజాశక్తి-గిద్దలూరు
పట్టణంలోని ఆర్టీసి బస్టాండ్ పక్కన గల విద్యుత్ శాఖ 132/33కెవి సబ్ స్టేషన్ దగ్గర డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరంతా సబ్ స్టేషన్‌లో నిలిచిపోతుందని, కావున వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ సిబ్బంది బుధవారం నగర పంచాయతీ కమిషనర్ వై.రామకష్ణయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బంది మాట్లాడుతూ సబ్ స్టేషన్ పరిధిలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరు ఎటు పోవడానికి మార్గం లేక నీరంతా సబ్ స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫారాల వద్ద నిలువ ఉండడం వలన ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని, తద్వారా విద్యుత్ ఆటంకం కూడా ఏర్పడుతుందని అన్నారు. కావున సబ్ స్టేషన్ లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు కోరారు. స్పందించిన కమిషనర్ వీలైనంత త్వరగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ సురేంద్రబాబు, డిఈఈ రవి కుమార్, ఏఈఈ నరసయ్య, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










