ప్రజాశక్తి-యర్రగొండపాలెం
యర్రగొండపాలెంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సాధారణ తనిఖీలలో భాగంగా గురువారం జిల్లా రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారి ఉపేంద్రరావు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. కక్షిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపేంద్రరావు మాట్లాడుతూ యర్రగొండపాలెంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎటువంటి సమస్యలు లేవన్నారు. రిజిస్టర్ చేయించుకున్న వారితో కూడా మాట్లాడామన్నారు. రిజిస్టర్ చేయించుకునే వారితో సిబ్బంది గౌరవంగా మాట్లాడాలన్నారు. రిజిస్టర్ చేయించుకునే వారు దస్తావేజు లేఖరుల బారిన పడకుండా నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి మాట్లాడుకోవాలన్నారు. బ్రోకర్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల మేరకు చార్జీలు చెల్లించి రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు. అయన పాటు సబ్ రిజిస్టర్ అధికారి జ్ఞాన సుందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ కుమార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.










