ప్రజాశక్తి -కనిగిరి : చెకుముకి సైన్సు సంబరాలను జయ ప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకుడు వి. మాలకొండా రెడ్డి తెలిపారు. స్థానిక యుటిఎఫ్ కార్యాల యంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సమావేశం మండ్లా శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాలకొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆలోచన శక్తిని, సజనాత్మకతను, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడానికి, మూఢనమ్మకాలు తొలగించడానికి గత 33 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంబరు 10న పాఠశాల స్థాయి, 30న జిల్లా స్థాయి, డిసెంబర్ 17న రాష్ట్రస్థాయిలో చెకుముకి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు పి.స్వరూప రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శ్రీనివాస రెడ్డి, జడ్డు రమణయ్య మహిళా విభాగం నాయకులు షేక్ బషీరా తదితరులు పాల్గొన్నారు.










