అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ విజయలక్ష్మి
ప్రజాశక్తి - ఆదోని
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో త్రీ టౌన్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలికలకు సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. త్రీ టౌన్ ఎస్‌ఐ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, సైబర్ నేరాలు, నెట్ వాడకం, ప్రేమ వివాహాలు వాటి పర్యావసానాలు వంటి అనేక విషయాలపై బాలికలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి ఫోన్ చేయాలని తెలిపారు. పోలీసు సిబ్బంది రాజేశ్వరి, ముంతాజ్ బేగం, వెంకట లక్ష్మీ, కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ డివిజన్ అధికారి జొనాథన్, అధికారులు, ఉమాదేవి, వెంకట్రామిరెడ్డి, ఈరమ్మ, బాలికలు పాల్గొన్నారు.










