Oct 29,2023 23:45

సైబర్‌ క్రైమ్‌ బాధితునికి సకాలంలో న్యాయం

సైబర్‌ క్రైమ్‌ బాధితునికి సకాలంలో న్యాయం
ప్రజాశక్తి -తిరుచానూరు: తిరుపతి జిల్లా, చంద్రగిరి పోలీస్‌ సబ్‌ డివిజన్‌, తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తిరుచానూరు లో నివాసం వున్న హిమగిరి బాబు అనే అతనికి ఒక అనుమానిత వ్యక్తీ నుండి ఈ నెల 4వ తేదీ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ సస్పెక్ట్‌ నెంబర్‌ నుంచి బాధితునికి వాట్సప్‌ ఏఏపి ద్వారా ఒక లింకును కూడా సెండ్‌ చేశారు. హిమగిరి బాబు అది తెలియకుండా సస్పెక్ట్‌ లింకును ఓపెన్‌ చేసి తన మొబైల్‌ నెంబర్‌ మీద ఓటిపి ని వెరిఫికేషన్‌ చేశాడన్నారు. ఆ తరువాత బాధితుని బజాజ్‌ ఫైనాన్సు క్రెడిట్‌ కార్డులో వరుసగా రూ.80,136, రూ.40,068, రూ.69,900, రూ.80,136, రూ.25,058 రూపాయల లావాదేవీలు (మొత్తం రూ.2,70,000లు) జరిగినట్లు గుర్తించా మన్నారు. తనకు తెలియకుండా తన క్రెడిట్‌ కార్డు నుంచి నగదు మాయమవడంతో బాధితునికి ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో తిరుపతి పోలీసు పెరేడ్‌ మైదానంలో ఉన్న జిల్లా సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌ కు వచ్చి ఫిర్యాదు చేశాడన్నారు. ఈ సైబర్‌ కేసులో బాధితునిక అతను సకాలంలో స్పందించి సైబర్‌ క్రైమ్‌ ఆఫీసుకు రావడం వల్లే తాము సంబంధిత నోడల్‌ ఆఫీసర్స్‌ తో సంప్రదించి మోసపోయిన మొత్తం నగదును రిఫండ్‌ చేసి, బాధితుడికి సకా లంలో న్యాయం చేశామ న్నారు. ఈ కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్‌ సీఐ రామ చంద్రా రెడ్డి, సైబర్‌ క్రైమ్‌ సిబ్బందిని ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి అభినం దించి, రివార్డు లను ప్రకటించారన్నారు. తిరుప తి జిల్లా ప్రజలు ఎవర యినా సైబర్‌ క్రైమ్‌ బారిన పడితే అధైర్య పడకుండా వెంటనే పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో ఉన్న సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్‌ క్రైమ్‌ కు గురైన వారు గోల్డెన్‌ అవర్‌ 24 గంటల లోపు సైబర్‌ క్రైమ్‌ ఆఫీస్‌ కు వెళితే న్యాయం జరిగే అవకాశం మెండుగా ఉంటుదని, మీరు అందుబాటులో లేకుంటే వెంటనే 1930 నెంబర్‌ కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. లేదా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సైబర్‌ క్రెమ్‌.జివోవి.ఇన్‌కు ఫిిర్యాదు చేయాలని ఈ సందర్భంగా తిరుపతి ఎస్‌పి పేర్కొన్నారు.