ప్రజాశక్తి - చిప్పగిరి
కీర్తిశేషులు గుమ్మనూరు శారదమ్మ మృతి తమ కుటుంబానికి తీరని లోటని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. బుధవారం చిప్పగిరి మండలం గుమ్మనూరులోని మంత్రి స్వగృహంలో శారదమ్మ పెద్దకర్మ (ఉత్తర క్రియలు) నిర్వహించారు. ముందుగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వారి వ్యవసాయ క్షేత్రంలోని శారదమ్మ సమాధి దగ్గరకు వెళ్లి పూజలు నిర్వహించారు. శారదమ్మ చిత్రపటానికి మంత్రి జయరామ్, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జయరామ్ మాట్లాడారు. తమ తల్లి మృతి కుటుంబానికి తీరని లోటని తెలిపారు. ఆమె కుటుంబ అభివృద్ధికి ఎంతోగానో కృషి చేశారని చెప్పారు. శారదమ్మ భర్త గుమ్మనూరు బసప్ప, కుమారులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర, తనయుడు, యువనేత గుమ్మనూరు ఈశ్వర్, ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ పాల్గొన్నారు.
శారదమ్మ చిత్రపటానికి పూలమాల నివాళులర్పిస్తున్న మంత్రి జయరామ్, కుటుంబ సభ్యులు










