Oct 06,2023 18:21

ప్రజాశక్తి - భీమడోలు
     సర్కిల్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని భీమడోలు నూతన సిఐ బి.భీమేశ్వర రవికుమార్‌ తెలిపారు. చల్లపల్లి సిఐగా పనిచేస్తూ బదిలీల్లో భాగంగా భీమడోలు వచ్చిన భీమేశ్వర రవికుమార్‌ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఈయన ఏలూరు వన్‌ టౌన్‌ ఎస్‌ఐగా పని చేశారు. ఆ తరువాత సిఐగా మచిలీపట్నం, అవనిగడ్డ, టిటిడి విజిలెన్స్‌ విభాగం, ఆపై చల్లపల్లిలలో పనిచేశారు. బాధ్యతలను స్వీకరించిన నూతన సిఐకు భీమడోలు, ద్వారకా తిరుమల ఎస్‌ఐలు చావా సురేష్‌, సుధీర్‌, ఇతర సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు.