Sep 08,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - సాలూరు :  రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ప్రభుత్వం ఉపేక్షించేది లేదని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ పాదయాత్రల్లో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కొంతమంది రౌడీ మూకలతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు కొంతమంది గిరిజన నాయకులతో వైసిపి ప్రభుత్వం పైన, తన పైన తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారు. గడచిన పదేళ్లు గా ఏజెన్సీ ప్రాంత ప్రజలు వైసిపికి అండగా వున్నారనే అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజన్నదొర ఆరోపించారు.