Jun 14,2023 22:52

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా ప్రవేటు, కార్పోరేట్‌ పాఠశాల, కళాశాల నిర్వాహకులు నడుపుతున్న బస్సులను తనఖీ చేసి సామర్థ్యం లేని వాటిని సీజ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్‌టిఒ కార్యాలయంలో జిల్లా రవాణ శాఖ అధికారి కరుణ సాగర్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బాబావలి మాట్లాడుతు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్‌ లేకుండా నడుపుతున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులపైన చర్యలు తీసుకోవాలన్నారు. బస్సు పరిమితికి తగ్గట్లు విద్యార్థుల నుంచి బస్సు ఫీజు రూపంలో తీసుకుని, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారన్నారు. అన్ని అంశాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జయచంద్ర, తరుణ్‌, హర్ష కుమార్‌, గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.