Jul 16,2023 15:33

ప్రజాశక్తి-తుగ్గలి : మండల పరిధిలోని ముక్కెళ్ల గ్రామంలో రూ 40 లక్షలతో సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులు స్థానిక నాయకులు గిడ్డయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో ముక్కెళ్ల గ్రామంలో జరిగిన గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు ముక్కెళ్ల ప్రజలు తమ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీదేవికి విన్నవించడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు రూ. 40 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే బీసీ కాలనీలో రూ 20 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎస్సీ కాలనీలో రూ 20 లక్షలతో సిసి రోడ్లు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతము ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు నిర్మించేందుకు మరో రూ 10 లక్షలు నిధులు మంజూరు చేస్తే కాలనీ మొత్తం సిసి రోడ్లు వెయ్యడం పూర్తవుతుందని, ఆ కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరుతున్నారు. ఈ పనులను మండల ఇంజనీర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ వేయిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సింగల్ విండో డైరెక్టర్ గిడ్డయ్య మాట్లాడుతూ గడపగడపలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి తమ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని కోరిన వెంటనే నిధులు మంజూరు చేశారని అందుకు తమంత ఎమ్మెల్యేకు అండగా ఉంటూ వచ్చే ఎన్నికలలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.