Oct 26,2023 10:28

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : బుధవారం అర్థరాత్రి విశాఖపట్నంలోని అసిల్మెట్ట నుండి రైల్వే కు వెళ్ళే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బైక్ ఫై అతి వేగంతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొక యువకుడు కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతులను రాజమండ్రికి చెందిన కాపురపు శ్యాం అనకాపల్లికి చెందిన హర్షగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని గురువారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.