ప్రజాశక్తి-ఏలూరు : జాతీయ రహదారి బాదంపూడి బైపాస్ వద్ద సోమవారం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల బస్సు బైక్ను ఢీకొంది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వృద్ధులు గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్లో ప్రధమ చికిత్స చేసి తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ముందు వెళ్తున్న గేదెను తప్పించే ప్రయత్నంలో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది.










