- యువత భవిష్యత్తుకు టిడిపి గ్యారెంటీ
- నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి
ప్రజాశక్తి-మంత్రాలయం : రాష్ట్రంతో పాటు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బాపురం సుధీర్ రెడ్డి అధ్యక్షతన మిషన్ రాయలసీమ ప్రణాళిక కర పత్రాలను ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో పాటు రాయలసీమ అభివృద్ధి, యువతకు భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందన్నారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న, రాయలసీమ ప్రాంతం లో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలన్న చంద్రబాబు తోనే సాద్యం అన్నారు. యువగళం పాదయాత్రలో యువనేత ప్రకటించిన మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ను కచ్చితంగా అమలు చేసి యువతకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ రాయలసీమ ప్రకటించిన డిక్లరేషన్ ను యువతకు చేయబోయే పథకాలు యువతకు తెలియజేసి రానున్న ఎన్నికలలో మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, నీలకంఠ రెడ్డి, షఫీ, చిన్న, బసవరాజు, నీలకంఠ, చిదానంద, క్రిష్ణ,నాగేష్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.










