రుచి మెరిగిన పెద్దపులి
- రెండవ రోజు పులి వేటలో మరో లేగ దూడ బలి
- భయాందోళనలో గ్రామస్తులు
ప్రజాశక్తి - కొత్తపల్లి
నల్లమల్ల అటవీ సమీప ప్రాంతంలోని గ్రామాల్లో పెద్దపులి రెండవ రోజూ విరుచుక పడింది. ఆవుల మందపై దాడి చేసి మరో లేగదూడను చంపింది. కొత్తపల్లి మండలం లోని పాత సిద్దేశ్వరంలో సోమవారం తెల్లవారు జామున పెద్దపులి లేగదూడపై దాడి చేసి చంపింది. ఆందోళన చెందుతున్న మండల ప్రజలకు మంగళవారం తెల్లవారుజామున మండలంలోని బలపాల తిప్ప గ్రామ సమీపంలో ఆవులమందపై దాడి చేసి కోడెదూడను చంపింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం రాత్రి ఆవుల మంద వద్ద కాపలాగా ఉన్న పశువుల నారాయణ అక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయానికే పెద్దపులి ఆవుల మంద వద్దకు చేరుకోగా ఆవులు పెద్దపులిని చూసి ఒక్కసారిగా అరుస్తూ బెదరడంతో అక్కడే ఉన్న పశువుల నారాయణ లేచి పెద్దపులిని గమనించి కేకలు వేస్తూ గ్రామస్తులను పిలిచాడు. కుటుంబ సభ్యులు గ్రామస్తులు, అరుపులు కేకలు వేయడంతో అప్పటికే పెద్దపులి దాడిలో లేక దూడ చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు అరుపులు కేకలు విన్న పెద్దపులి వెంటనే ఆవుల మంద నుంచి సుమారు 300 మీటర్ల దూరంలో పాగ వేయడం అక్కడే పెద్దపులి సుమారు వేకుజామున 5:30 వరకు ఉన్న సంఘటనను గ్రామస్తులందరూ కల్లారా చూడడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. వెంటనే సమాచా రాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజే శారు. దీంతో ఫారెస్ట్ అధికారులు స్థానిక ఎఫ్‌ఎస్‌ఓ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకునే లోపు పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయి ందని గ్రామస్తులు చెప్తున్నారు. అనంతరం ఎఫ్‌ఆర్‌ఓ పట్టాభి యాంటీ పోచింగ్ స్క్వాడ్ సుభాష్ సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన లేగ దూడను పరిశీలించారు. పరిసర ప్రాంతంలో పెద్దపులి ముద్రలను గుర్తించి అక్కడే ఉన్న కెమెరా ట్రాప్‌లను పరిశీలించారు. ఏది ఏమైనప్పటికీ పెద్దపులి రుచి మరిగిందని గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, పెద్దపులికి వేట మార్గం సులువుగా ఉందని రాత్రి సమయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెద్దపులి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గ్రామ స్తులు అధికారులకు సహకరిస్తే పెద్దపులి రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వైద్యాధికారులు చనిపోయిన లేగ దూడ కు పోస్టుమార్టం నిర్వహించారు.










