Oct 17,2023 22:20

రూ.5 లక్షల బీమా చెక్కు పంపిణీ

రూ.5 లక్షల బీమా చెక్కు పంపిణీ
ప్రజాశక్తి - పిచ్చాటూరు: పిచ్చాటూరు మండలం పులింగుంట లో రోడ్డు ప్రమాదంలో మతి చెందిన రమేష్‌ భార్య లతకు వైఎస్‌ఆర్‌ బీమా కింద రూ.5 లక్షలు చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళ వారం అందించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అండగా ఉంటుం దని, పలువురు ప్రమాదాలకు గురై మరణిస్తు న్నారని, కొందరు వికలాంగులు అవుతు న్నారని ప్రభుత్వ బీమా పథకాన్ని నియోజక వర్గంలో అధికారులు తన వంతుగా అర్హులైన ప్రతి ఒక్కరిని వర్తించేందుకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు మధుసూదన్‌ రావు, ఎంపీడీవో శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ నాయుడు, సర్పంచ్‌ శ్యామల, ఎంపీటీసీ రమేష్‌ రాజు, తప్పయ్య, మోహన్‌, బాబు రెడ్డి, పాల పద్మనాభం పాల్గొన్నారు.