May 26,2023 22:54

రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్‌పర్సన్‌

          ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు మంజూరు చేయించుకొచ్చి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ధర్మవరం పట్టణంలోని ఎంఐజి లేఅవుట్‌ వద్ద నుంచి మరూరు జాతీయ రహదారి వరకు రూ.29,10 కోట్లతో 80 అడుగుల తారు రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ బోయ గిరజమ్మ, ఆహుడా ఛైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరి కాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతు. ధర్మవరం నుంచి మరూరు వద్ద ఉన్న జాతీయ రహదారికి మధ్యన 126 ఎకరాల విస్తీర్ణంలో మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కల కోసం రూ.131 కోట్ల వ్యయంతో ఎంఐజి లేఅవుట్‌ (జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌)ను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేయనున్నట్లు జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి నుంచి ఎంఐజి లేఅవుట్‌ వరకు రూ.29.10 కోట్ల వ్యయంతో 80 అడుగుల తారు రోడ్డును వేస్తున్నట్లు చెప్పారు. ఆరు నెలల్లోపు పనులను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అహుడా ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఈశ్వరయ్య, డీఈ సూర్యనారాయణ, వైస్‌ ఛైర్మన్లు భాగ్యలక్ష్మి, పెనుజూరు నాగరాజు, పట్టణ కౌన్సిలర్లు, ధర్మవరం మండలం ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్‌ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.