అమడుగూరు : రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టాప్ పేపర్ల కొరత తీవ్రం అవుతోంది. ఒకరంగా స్టాంప్‌పేపర్లు భవిష్యత్తులో కనుమరుగు అవుతాయన్న విధంగా చర్చ నడుస్తోంది. రూ.100 విలువ గల జుడీషియల్ స్టాంపులు ఇటీవల సబ్‌రిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదు. కార్యాలయంలో ఇవి లేకపోవడంతో బయట దళారులు వాటిని ఏదో రూపంలో తెచ్చుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వంద రూపాయల స్టాంపులను రూ.500కు విక్రయిస్తున్నారు. ఒక్కా సారిగా ప్రభుత్వం 100 రూపాయల స్టాంపుల సరఫరా నిలిపేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వీటి స్థానంలో ఈ స్టాంపులను వినియోగించాలని ఆదేశాలు ఇచ్చింది. వీటి గురించి పెద్దగా అవగాహన లేని ప్రజలు వాటిని తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 100 రూపాయల స్టాంపులు కోసం నిత్యం వందలాది మంది మంది ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ స్టాంపులు పైనుంచి రావడం లేదంటూ అధికారులు పేర్కొంటున్నారు.
రూ.100 స్టాంప్‌లు రావడం లేదు...
గత కొంతకాలంగా రూ.100 రిజిస్ట్రేషన్ స్టాంపులు రావడం లేదని కదిరి సబ్ రిజిస్ట్రార్ శిరీష భరత్ తెలిపారు. కార్యాలయంలో ఇప్పటి వరకు స్టాకు ఉన్న 100 రూపాయల స్టాంపులను ఇచ్చేశామన్నారు. కార్యాలయం అవసరానికి అనుకూలంగా కొద్దిగా ఉండొచ్చని, వాటిని కూడా ప్రజలకు ఇచ్చేస్తామన్నారు. గత కొన్ని రోజుల క్రితమే వంద రూపాయల స్టాంపులు కావాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. అయితే అవి నేటికీ రాలేదన్నారు. ప్రజలు కూడా సులుభమైన ఈ స్టాంపు విధానంను అలవాటు చేసుకోవాలని సూచించారు. కదిరి పట్టణంలో ఈ స్టాంపు వినియోగించేలా మీసేవా కేంద్రాలకు అనుమతులు ఇచ్చామన్నారు. పూర్తిస్థాయిలో ఈ స్టాంపు వినియోగంలోకి వస్తే ప్రజలు, అధికారులకు ఇబ్బందులు ఉండవు. నాన్ జుడీషియల్ స్టాంపులు ఏ విధంగా విక్రయిస్తున్నారో ఈస్టాంపు విధానాన్ని కూడా స్టాంపు వెండర్లు విక్రయించుకోవచ్చునని సూచించారు. వీటిని ఎవరైనా కతిమ కొరతను సష్టించి అధిక ధరలకు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










