Sep 12,2023 20:04

పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని ఎస్‌కెడి కాలనీలో పురాతన బావి చుట్టూ కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్‌ ఇంజినీర్‌ నాగభూషణం రెడ్డి, ఆ వార్డు ఇన్‌ఛార్జీ చంద్రశేఖర్‌ రెడ్డితో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి మాట్లాడారు. రూ.10 లక్షలతో పురాతన బావి చుట్టూ కంచె ఏర్పాటు పనులు మొదలయ్యాయని తెలిపారు. పురాతన బావిలో నీరు నిండుగా ఉందన్నారు. స్థానికులు బావిలో వ్యర్థాలు వేయడం వల్ల దుర్వాసన వస్తోందని గతంలో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పాఠశాల సమీపంలో బావి ఉందని, ప్రమాదవశాత్తు చిన్నారులు బావిలో పడే ప్రమాదం ఉందని గమనించామని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. బావిలోని పూడిక తొలగించి ఉన్న నీటిని తోడి శుభ్రం చేసి మోటారు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. బావిలో ఊట పుష్కలంగా ఉందని, ఇతర అవసరాలకు ఉపయోగించుకునేందుకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ రఘుకు సూచించామని మున్సిపల్‌ ఇంజినీర్‌ నాగభూషణం రెడ్డి తెలిపారు. నాయకులు చిన్న ఉన్నారు.