May 17,2023 22:38

ఫారెస్టు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సభ్యులు

ప్రజాశక్తి-కనగానపల్లి : ఎంపిపి కుంపటి భాగ్యమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఎక్కువగా రెవెన్యూ సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వీటికి సమాధానం చెప్పాల్సిన తహశీల్దార్‌ సమావేశానికి రాకపోవటంతో ప్రజాప్రతినిధులు త్రీవ అసహనం వ్యక్తం చేశారు. అలాగే అటవీశాఖకు సంబంధించి కుర్లపల్లి, కుర్లపల్లి తండా గ్రామాల సమీపంలో ఫారెస్ట్‌ అధికారి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంతమంది తన మనుషులను ఫారెస్ట్‌ ఇన్‌ఛార్జులుగా నియమించి ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్ము లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నారని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఫారెస్ట్‌ అధికారి గౌతమిపై చర్యలు తీసుకోవాలని సర్పంచులు మురళి, విజరు, మండల ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఫారెస్ట్‌ లో వర్కులకుసంబంధించి ఎంత డబ్బును వినియోగించారని ని ప్రజా ప్రతినిధులు అడగగా ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. దీంతో ఫారెస్ట్‌ అధికారి అక్రమాలకు పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.