రోగి వైద్యానికి వంశీ 50 వేలు ఆర్థిక సహాయం.
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడుకి చెందిన కొమరవల్లి ఆశీర్వాదం (71) వైద్యానికి ఎమ్మెల్యే వంశీ రూ.50 వేల ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు నగదును రోగి కుటుంబానికి అందజేశారు. వైద్యుల సూచన మేరకు ఎమ్మెల్యే వంశీ పిన్నమనేని సిద్ధార్ధ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వారం రోజుల క్రితం ఆ ఆసుపత్రిలో చేర్పించారు. మధుమేహ వ్యాధి ప్రభావంతో కాలు ఇన్ఫెక్షన్ మరింతగా ప్రభలకుండా, ప్రాణానికి ఎలాంటి హాని లేకుండా కాలు కొంతభాగం తొలగించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడంతో ఆశీర్వాదం పూర్తి ఆరోగ్యంతో కొలుకున్నాడు. ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్స పొంది ఆశీర్వాదం పూర్తి ఆరోగ్యంతో కోలుకోవడానికి సహకరించిన ఎమ్మెల్యే వంశీకి ఆశీర్వాదంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖర్చు అయిన రూ.50 వేలు నగదును ఆశీర్వాదం కుటుంబ సభ్యులకు విజయవాడ రూరల్ మండల ఎంపీపీ చెన్ను ప్రసన్న కుమారి, జడ్పీటీసీ సభ్యులు కాకర్లమూడి సువర్ణరాజు, ఎనికేపాడు గ్రామ సర్పంచ్ రాచమళ్ళ పూర్ణచంద్రరావు, జెడ్.పి.టీ.సి అన్నవరపు ఎలిజిబెత్ రాణి, ఎం.పీ.టీ.సీ సభ్యులు గంగుల శ్రీనివాసరావు, రాచమల్ల శ్రీనివాసరావు, దూరు రత్నం, ముఖ్య నాయకులు రామిశెట్టి వెంకటేశ్వరరావు, కోనేరు సుబ్బారావు, సమ్మిటి సాంబశివరావు, మోతే సుబ్బారావు, నరసింహ, మెండెం రాంబాబు, వెలగపల్లి ప్రకాష్, కోమరవల్లి ఆనందరావు, సాయల రమేష్, కోమరవల్లి సుదీర్, కాటూరి గంగాధర రావు, తలతోటి మోహనరావు తదితరులు శుక్రవారం అందజేశారు.










