Jun 05,2023 21:21

మృతి చెందిన హుస్సేన్‌ వలి

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమార్తె మృతి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

      ఆళ్లగడ్డ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో సోమవారం బైక్‌ను కారు ఢకొీట్టిన ప్రమాదంలో తండ్రీ కుమార్తె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. దొర్నిపాడు గ్రామానికి చెందిన దూదేకుల హుస్సేన్‌ వలి తన భార్య కాశీంబి, ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం బనగానపల్లెకు బైకుపై బయల్దేరాడు. కోవెలకుంట్ల వైపు నుండి ఆళ్లగడ్డ వైపు వస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న బైకును ఢకొీట్టింది. దీంతో బైకుపై ఉన్న హుస్సేన్‌ వలి (38), పెద్ద కూతురు అమీనా(10) ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య కాశీంబికి వెన్నెముఖ, కాళ్లకు గాయాలయ్యాయి. పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి సిఐ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సై తిరుపాలు, సిబ్బంది చేరుకొని గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రీ కుమార్తె మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సిఐ తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. మృతి చెందిన హుస్సేన్‌ వలి వ్యవసాయ కూలిగా పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ నరేంద్ర పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.