Apr 22,2023 21:55

వైద్యపరికరాలను అందజేస్తున్న దృశ్యం

ధర్మవరం టౌన్‌ : ధర్మవరం ప్రభుత్వాస్పత్రిలో రక్తపరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను ఓ దాత అందజేశారు. పట్టణంలోని గీతానగర్‌కు చెందిన దాత శివయ్య రూ.3వేలు విలువ చేసే మెటీరియల్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పద్మలతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నీషియన్లు జయమ్మ, అశోక్‌రెడ్డి, కృష్ణకాంత్‌, హరి సిబ్బంది పాల్గొన్నారు.