ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : విద్య, వైద్య శాఖాధికారులు సమన్వయ కషితో కష్ణాను రక్తహీనత రహిత జిల్లాగా మార్చడానికి పాటుపడాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. జిల్లాలో సుస్థిరాభివద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా గురువారం ఆయన స్పందన సమావేశపు మందిరంలో ఉపాధ్యా యులు, ఎఎన్‌ఎంలతో సమావేశమై పిల్లలలో రక్తహీనత నివారణకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారన్నారు. టీచర్లు, ఏఎన్‌ఎంలు రక్తహీనత నివారణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రక్తహీనత వల్ల కలిగే దుష్ఫలితాలను పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. సరఫరా చేస్తున్న ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను ఏఎన్‌ఎంల ముందే పిల్లలకు వేయించేలా చూడాలని వారికి సూచించారు. రక్తహీనత వల్ల పిల్లల్లో మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లోపిస్తుందని, తద్వారా చదువు మీద దష్టి పెట్టలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. దీనిని దష్టిలో పెట్టుకొని మైల్మ్, మోడరేట్, సివియర్ లక్షణాలు ఉన్న వారికి మధ్యాహ్నం భోజనం తరువాత మాత్రలను వారిచేత మింగించాలని టీచర్లకు సూచించారు. కేవలం గురు వారం మాత్రమే కాకుండా ప్రతి రోజూ పాఠశాలలకు ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను సరఫరా చేసే విధంగా వైద్యశాఖాధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారిణి తాహెరా సుల్తానా, జిల్లా వైద్యశాఖాధికారిణి డా.జి.గీతాబాయి, వైద్యులు, టీచర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.










