Oct 20,2023 23:34

మార్కాపురంలో దీక్షలు నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-దర్శి : ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షను విధాన్ని కొన సాగించాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ధనిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాతపెన్షను విధానాన్ని కొన సాగించాలని కోరుతూ స్థానిక యుటిఎఫ్‌ భవనంలో నిరాహార దీక్షలను ప్రారంభించారు. యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు మీనగ శ్రీను, కాశీం ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలను మండల గౌరవాధ్యక్షుడు తిరుపతిస్వాములు, జిల్లా కార్యదర్శి డి.వెంకటరెడ్డి ప్రారంభించారు. సాయంత్రం యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు అనంతరెడ్డి నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షలను విరమింజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌. తిరుపతిరెడ్డి, దార్ల శ్రీనివాసులు, రామారావు, చెంచయ్య, కిరణ్‌రెడ్డి, ఏడుకొండలు, రోశయ్య, ప్రసాదరావు, ఎం. యలమందరెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం : సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్‌ రాజీలేని పోరాటం సాగిస్తోంది. అందులో భాగంగా స్థానిక యుటిఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం నిరాహారదీక్షలు ప్రారంభించారు. సిపిఎస్‌తో పాటు జిపిఎస్‌ను రద్దు చేయాలని, పాత పెన్షను విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది. యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు డి.ఖాశింసాహెబ్‌, టి.సత్యనారాయణరెడ్డి, మధుసూదన్‌రావు, బి.శ్రీరాములు, పి.వెంకటేశ్వర్లు, శంకరరెడ్డి, పాపయ్య దీక్షాపరులకు పూలమాలలు వేసి నిరాహారదీక్షలను ప్రారంభించారు. సిపిఎస్‌ అంతమే... యుటిఎఫ్‌ పంతమని ఆ సంఘ నాయకులు నినాదాలు చేశారు. దీక్షల్లో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్‌, సిపిఎస్‌ డివిజన్‌ కన్వీనర్‌ వినుకొండ రాజేష్‌, పెద్దారవీడు మండల ప్రధాన కార్యదర్శి డి.యల్లమందారెడ్డి, తర్లుపాడు ప్రధాన కార్యదర్శి నాసరయ్య, రఫి, రామకృష్ణ, అల్లూరి శ్రీనివాసులు కూర్చుకున్నారు. దీక్షలకు ఎస్‌.మహాలక్ష్మి, సీనియర్‌ నాయకులు ఆర్‌ఎం. ఝాన్సీపాల్‌, జె.హైమావతి, ఎన్‌.ఉమాదేవి వివిధ మండలాల ఉపాధ్యాయులు, జెవివి నాయకుడు వెంకటరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు జి. గురుస్వామి, షేక్‌ చాంద్‌బాషా, వెంకటేశ్వరరెడ్డి, పీరాన్‌సాహెబ్‌, పి.జయరామిరెడ్డి, ఎస్‌. శ్రీనివాస్‌నాయక్‌, నారు వెంకటేశ్వరరెడ్డి, డిపి.మస్తాన్‌, పి.చలమారెడ్డి, వై.ఆంజనేయులు, కాశిరెడ్డి, రమణ పాల్గొన్నారు. కనిగిరి : జిపిఎస్‌, సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని, కోరుతూ యుటిఎఫ్‌ కార్యాలయంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు కె. కృష్ణమూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హక్కుల సాధనకు పోరాటమే శరణ్యమన్నారు. ఈ దీక్షల్లో మూలే నాగిరెడ్డి, ఖాజా హుస్సేన్‌, డి శ్రీనివాసులు, మాల్యాద్రి, మూల్య వెంకటేశ్వరరెడ్డి, ఎంకె. షరీఫ్‌, కోటిరెడ్డి పోలరాజు, ఎం నారాయణరెడ్డి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకుడు రామచంద్రారెడ్డి, జెవివి నాయకులు వి.మాలకొండారెడ్డి, ఎస్‌కె.ఖాజా హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.