న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ధరలను ఆదివారం కూడా చమురు సంస్థలు పెంచాయి. రికార్డు స్థాయికి ధరలు చేరుకున్నాయి. దీంతో వాహనదారులకు మరింత భారం కానుంది. తాజా పెంపుతో చమురు ధరలు...విమాన ఇంధన ధర కంటే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరిగి రూ. 107.24 నుండి 107.24కు చేరుకుంది. అదేవిధంగా డీజిల్ సైతం 35 పైసలు పెరిగింది. ఈ పెంపుతో లీటర్ డీజిల్ ధర రూ. 96.32కి చేరింది. ఇక ఢిల్లీలో విమానయాన టర్బైన్ ఇంధనం (ఎటిఎఫ్) లీటర్ రూ. 79గా ఉంది. ఇక కోల్‌కతాలో డీజిల్ ధర రూ. 100కు చేరువగా ఉంది.

కాగా, దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా వచ్చే 14 నుండి 29 వరకు ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా ఈ 15 రోజుల పాటు భారీ క్యాంపెయిన్లను నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు.










