May 11,2023 22:03

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు

        పుట్టపర్తి అర్బన్‌ : వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద జిల్లాలో రీ సర్వే పనులను మరింత వేగవంతం చేసి, ఇప్పటికే పూర్తయిన గ్రామాల్లో వచ్చే ఆదివారం లోపు స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. గురువారం నాడు విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష భూ హక్కు పత్రాలు స్టోన్స్‌ గ్రౌండ్‌ టు థింక్‌ ప్రక్రియ తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రీ సర్వేలో జిల్లాలో 26 గ్రామాలకు సంబంధించి 27,146 నెంబర్‌ రాళ్లు వచ్చాయన్నారు. ఇందులో ఇప్పటివరకు 22,714 రాళ్లను ఆయా పొలాల్లో నాటామన్నారు. మరో 4432 రాళ్లు నాటాల్సి ఉందన్నారు. వచ్చే ఆదివారం లోపు మిగతా రాళ్లను నాటే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. భూ పత్రాలకు సంబంధించి 6620 భూహక్కు పత్రాలు రాగా అందులో 93 శాతం పత్రాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగిలిన భూహక్కు పత్రాలు త్వరగతిన పూర్తి చేస్తామన్నారు. రీ సర్వే చేపట్టిన గ్రామాల్లో గ్రౌండ్‌ టు థింక్‌ ప్రక్రియ వేగవంతంగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే ఏడి రామకష్ణ, డిప్యూటీ తాసిల్దారు షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.