ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం క్రింద చేపట్టిన రీ సర్వే పనులు పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో రీ సర్వేపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, డిఐఒలు, ఇడిఎంలు, డివిజన్ మండల విలేజ్ సర్వేర్లకు వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఇందులో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా చేపట్టిన రీ సర్వే జిల్లాలో నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలన్నారు. 26 గ్రామాల్లో రీ సర్వే పూర్తి అయిందని, 13వ నోటిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రెండవ విడతలో 59 గ్రామాల్లో రీ సర్వే పనులు జరుగుతుండగా ఇందులో 14 గ్రామాల్లో 13వ నోటిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా గ్రామాల్లో వేగవంతంగా రీ సర్వే చేపట్టాలని జెసి ఆదేశించారు. మూడవ విడతలు 125 గ్రామాల్లో రీ సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. ఆ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రౌండ్ టు థింక్, గ్రౌండ్ వాలిడేషన్, విఎస్‌ఎలాగిన్, ఆర్డీవో లాగిన్, జెసి లాగిన్ లలో సకాలంలో ఆన్ లైన్ అప్లోడ్ చేయాలన్నారు. కేటగిరి వారిగా పట్టా భూమి ఆన్ లైన్ మెంట్, ల్యాండ్ ఎండోమెంట్, ల్యాండ్ తదితర వాటికి సంబంధించి ల్యాండ్ పార్సిల్ నెంబర్లు వేరువేరుగా ఇవ్వాలన్నారు. పనులు త్వరగతిన పూర్తి చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నెలవారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ వర్క్ షాప్‌లో ఆర్డీవో లు రాఘవేంద్ర, తిప్పే నాయక్, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ క్రాంతి, తహశీల్దార్లు,సర్వేయర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










