ప్రజాశక్తి - చిలమత్తూరు : రీసర్వేను వేగవంతం చేయాలని సబ్‌కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని గురువారం తనిఖీ చేశారు.ఈ సందర్బంగా రీ సర్వే జరుగుతున్న తీరును సర్వేయర్, వీఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. భూ రీ సర్వే ను వేగవంతం చేయాలని ఆదేశించారు. కంబాలదిన్నె, మర్రిమాకులపల్లి, పొలాల్లో ఈనెల ఆఖరిలోపు భూ రీసర్వేని పూర్తిచేయాలని అన్నారు. దీంతోపాటు జులై నెలలో యజ్ఞశెట్టిపల్లి,సుబ్బారావు పేట భూములను రీసర్వే చేయాల్సి ఉంటుందన్నారు, ఇప్పటికే సర్వే చేయడంలో వెనుకబడిఉన్నారని గుర్తు చేశారు. ఎక్కడైన టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నాగరాజు,డిప్యూటీ ఈ సర్వే తహశీల్దార్ యూనిఫ్ బాబు, డిప్యూటీ రీసర్వే ఇన్‌ఛార్జి చిట్టిబాబు,మండల సర్వేయర్లు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.










