ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా మారుమూల గిరిజన గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. మండలానికి మారుమూల కివర్ల పంచాయతీ పరిధి పూతికపుట్టు రింగ్ రోడ్డు వర్షాల కారణంగా భారీ కోతకు గురైంది. బొర్రాపాలెం నుండి చటకంభ, బోనూరు .చీడిమెటు, జగడాలమామిడితో పాటు పది గ్రామాలకు ఈ రింగ్ రోడ్డు విస్తరించి ఉంది. గత నాలుగేళ్ల క్రితం మట్టి రోడ్డు పనులు పూర్తి చేసి బీటీ రోడ్డు నిర్మించవలసి ఉన్నప్పటికీ నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తికావస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఇందుకు నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆయా గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు గురైనప్పుడు ఆసుపత్రులకు వెళ్లాలన్నా.. సామగ్రిని ద్వి చక్ర ప్రవాహనాలపై ప్రయాణం చేయలేని పరిస్థితితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తారు రోడ్డు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.










