Aug 08,2023 23:02

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : గ్రామ రెవెన్యూ సహాయకులకు దీర్ఘ కాలంగా పెండిగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ ఆధ్వర్యంలో కలక్టరేట్‌ ధర్నా చౌక్‌ చేపట్టిన నిరసన ధర్నా రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు బొడ్డు వెంకట రత్నం, చాట్ల రమేష్‌ లు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని గత టిడిపి ప్రభుత్వంలో పోరాటాలు చేస్తున్న తమకు అప్పుడు ప్రతి పక్షంలో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాటాలకు సంఘీభావం తెలిపి తాను అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నేర వెర్చలేదన్నారు. పైగా టిడిపి ప్రభుత్వంలో ఇచ్చిన అరియర్స్‌ లో కోత పెట్టారని, ఇది దుర్మార్గమన్నారు. కాబట్టి ఇచ్చిన హామీ మేరకు సమస్యలన్నీ పరిష్కరిం చాలని లేదంటే రానున్న రోజుల్లో దశల వారీగా ఉద్యమాలను ఉదతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు. సిఐటియు నగర కార్యదర్శి సి హెచ్‌ జయరావు లు సంఘీభావం తెలిపిన ఈ ధర్నా లో వెన్నా వెంకటేశ్వరావు, రాఘవులు,జాన్సీ,అరుణ, జిల్లా నాలు మూలాల నుండి విఆర్‌ఏలు పాల్గొన్నారు.