స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగిస్తున్న విజిలెన్స్ అధికారులు
ధర్మవరం టౌన్ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ సాయిప్రసాద్, ఎస్‌ఆర్‌టి యామిని సరస్వతి తెలిపారు. వారు ఆదివారం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం సర్కిల్‌లో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. అందులో భాగంగా ఓ వాహనంలో 17,220 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి ముదిగుబ్బ మండలంలోని అడివి బ్రాహ్మణపల్లికి చెందిన రమేశ్ నాయక్, రాప్తాడు మండలం ఎర్రగుంటకు చెందిన బోయ నరసింహులు, కర్నాటకలోని చిక్కబళ్లాపూర్‌కి చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డిల ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సిఎస్‌డిటి లక్ష్మీదేవికి అప్పగించామన్నారు.










