మాట్లాడుతున్న సిఇఒ సరిత
రేపు డిసిసిబి బ్యాంక్ ప్రారంభం
ప్రజాశక్తి-ఎఎస్‌పేట:మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన బ్రాంచ్‌ను 3వ తేదీ శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నట్లు జిల్లా డిసిసిబి బ్యాంకు ఇన్‌ఛార్జి సిఇఒ జిఎం సరిత, జిఎం ఉషారాణి పేర్కొన్నారు. నూతన బ్యాంకు ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఏర్పాట్ల విషయంపై బుధవారం ఎఎస్ పేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా బ్యాంకులోని ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధిలో భాగంగా నూతన బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతుల అభివృద్ధి బ్యాంకు ముఖ్య ఉద్దేశమన్నారు. బ్యాంకు పరిధిలో వ్యవసాయ రుణాలు దీర్ఘకాలిక రుణాలు వ్యక్తిగత రుణాలు బంగారు ఆభరణాలపై రుణాలు గృహ నిర్మాణాలపై రుణాలు ఎడ్యుకేషన్ రుణాలు ఎస్‌హెచ్‌జి రుణాలు తదితర రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డిపాజిట్లపై 11శాతం వడ్డీ అందజేస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులో లాకర్ సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిజిఎంలు వి మధుసూదనరావు, వై దయాకర్ రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.










