Aug 17,2023 22:54

 ఒక సర్పంచ్‌, 8 వార్డులకు జరగనున్న ఎన్నికలు ొ ఎన్నిక రోజే ఫలితాలు వెల్లడి
ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) :
జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లా పంచాయతీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. కష్ణా జిల్లాలో మొత్తం రెండు సర్పంచ్‌ స్థానాలకు 31 వార్డ్‌ మెంబర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా ఒక సర్పంచ్‌ మరియు 28 వార్డు మెంబర్లు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన ఒక సర్పంచ్‌ ఎనిమిది వార్డు మెంబర్లకు ఈనెల 19న ఎన్నిక జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని అనంతరం రెండు గంటలకు ఫలితాలు వెల్లడి చేస్తారు. వీటిలో పెడన మండలం కొంగం చర్ల గ్రామ సర్పంచ్‌( జనరల్‌ మహిళ) స్థానానికి ఎన్నిక జరగనుండగ, అలాగే మిగిలిన 8 వార్డులకు సంబంధించి బాపులపాడు మండలం మల్లవల్లి పంచాయతీలో 6వ వార్డు (ఎస్‌సి), ఉంగుటూరు మండలం తాళ్లపర్రు గ్రామపంచాయతీ 4వ వార్డ్‌, (జనరల్‌) బంటుమిల్లి మండలంలో బంటుమిల్లి 4 వార్డ్‌( ఎస్‌ సి,మహిళ) గూడూరు మండలం పోలవరంలో ,11వ వార్డు(జనరల్‌ మహిళ ) పెడన మండలంలో కాకర్ల ముడి లో 4వార్డ్‌ ( బి సి,మహిళ ) కంకిపాడు పంచాయతీలో 9, వార్డ్‌(జనరల్‌) పమిడిముక్కల మండల పరిధిలోని అలినక్కిపాలెం 6 వార్డ్‌ (జనరల్‌ మహిళ ),వుయ్యురు మండలం గండి గుంట పంచాయతీలో 10 వార్డ్‌ (బి సి)కు ఎన్నికలు జరగనున్నాయి. ఒక సర్పంచ్‌ స్థానిక ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా,8 వార్డులకు 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.వీటిలో కంకిపాడు పంచాయతీ వార్డుకు ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలలో మొత్తం 3236 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం పది పోలింగ్‌ స్టేషన్‌ లు ఏర్పాటు చేశారు.ఎన్నకల ప్రక్రియ సజావుగా జరిగేందుకు తొమ్మిది మంది రిటర్నింగ్‌ అధికారులను, తొమ్మిదిమంది పోలింగ్‌ అధికారులను ,మరో 31 మంది సహాయ పోలింగ్‌ అధికారులను నియమించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్‌ నాయక్‌
ఈ నెల 19 న జిల్లాలో జరుగుతున్న ఒక సర్పంచ్‌, ఎనిమిది వార్డు సభ్యుల ఎన్నికకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌ వి.నాగేశ్వర్‌ నాయక్‌ తెలిపారు. ఎన్నికల రోజు ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీస్‌ బందోబస్తు,పాటు అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వీడియో కెమెరలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అలాగే ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.కాబట్టి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.