May 08,2023 22:10

హెల్ల్‌కిట్ల పంపిణీలో సొసైటీ ఛైర్మన్‌, తదితరులు

పరిగి : జిల్లా వ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలను మరింత విస్తరింపజేస్తామని తద్వారా ప్రతి గ్రామంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ జిఎంసి. శేఖర్‌ తెలిపారు. ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం పరిగి మండలం ఎర్రగుంట లో 25 కుటుంబాలకు హెల్త్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ మాట్లాడుతూ ఈ సొసైటీ ద్వారా విద్య ఆరోగ్యం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్సలు అనంతరం కంటి అద్దాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి మరిన్ని సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట సర్పంచి బాలకష్ణ, జిల్లా సెక్రటరీ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వసంత్‌, జిల్లా కోఆర్డినేటర్‌ రమేష్‌, బంగారు చంద్ర, శివప్ప, రవితేజ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, ఉదరు, సాయి, శ్రీనివాసులు, మూర్తి, నాగేష్‌, శ్రీనివాసులు, నవీన్‌, మంజు, జగదీష్‌, వినరు ఆసుపత్రి సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : రెడ్‌క్రాస్‌ ఆశయాలు, సేవా గుణాన్ని అంతటా విస్తరింప చేస్తామని రెడ్‌ క్రాస్‌ సంస్థ జీవిత కాల సభ్యులు డాక్టర్‌ నరసింహులు, జిల్లా వైస్‌ చైర్మన్‌ పోలా ప్రభాకర్‌ పేర్కొన్నారు. ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని మధు కంటి వైద్యశాలలో సోమవారం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పద్మలత, డాక్టర్‌ నజీర్‌, రెడ్‌ క్రాస్‌ సంస్థ జీవితకాలపు సభ్యులు డాక్టర్‌ సత్య పాల్గొన్నారు.
హిందూపురం : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆద్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ అసుపత్రిలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ డిస్ట్రిక్ట్‌ సెక్రటరీ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ వసంత్‌, డిస్టిక్‌ కోఆర్డినేటర్‌ రమేష్‌, మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సెంట్రల్‌ సీడ్‌ డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి, డాక్టర్‌ వెంకటరమణ, అసుపత్రి మెడికల్‌ సుపరింటెండెంట్‌ రోహిల్‌, రవితేజ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : రెడ్‌క్రాస్‌ సంస్థ సేవలు అనన్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ నజీర్‌ పేర్కొన్నారు. ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆవిర్భావం గురించి వివరించారు.