ధ్రువపత్రం అందజేస్తున్న అధికారులు
ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని రౌడూరు 6వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో చాకలి లింగమ్మ విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 166 ఓట్లకు గాను 122 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. చాకలి లింగమ్మకు 84 ఓట్లు రాగా, మంగలి వీరేష్‌కు 28 ఓట్లు వచ్చాయి. 9 ఓట్లు చెల్లనివిగా, ఒక ఓటు నోటాకు వేశారు. 56 ఓట్ల మెజార్టీతో చాకలి లింగమ్మ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభారాణి ధ్రువీకరణ పత్రం అందజేశారు. వైసిపి మద్దతుదారులు చాకలి లింగమ్మ గెలుపొందడంతో వైసిపి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. వైసిపి నాయకులు సుధాకర్ రెడ్డి, సోమిరెడ్డి, పాండు రంగారెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు.










