కూరగాయల వ్యాపారితో మాట్లాడుతున్న చిలకం మధుసూదన్‌రెడ్డి
ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : రౌడీయిజం, దౌర్జన్యం నుంచి ధర్మవరాన్ని కాపాడుకుందామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 25,26 వార్డులలో ఆయన సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో రోజురోజుకు రౌడీయిజం, దౌర్జన్యాలు మితిమీరి పోయాయన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదన్నారు. ఏ వార్డుకు వెళ్లిన ప్రజలు సమస్యలను చెబుతున్నారన్నారు. వైసీపీ నాయకులైతే ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మవరంలో చేనేత పరిశ్రమ వైసీపీ పాలకుల అలసత్వం వల్ల తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు.










