Sep 19,2023 19:34

పూజలు నిర్వహిస్తున్న నారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
వర్షాల్లేక కరువులో అల్లాడుతున్న రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారని ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ తెలిపారు. 77 చెరువులకు నీరందించే బృహత్తర కార్యక్రమం చేపట్టారని చెప్పారు. మంగళవారం బెల్డోన గ్రామంలో సర్పంచి కరివేముల సావిత్రి, గోవిందు ఆహ్వానం మేరకు వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అన్నదాన నిమిత్తం వినాయకుని కమిటీ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. జగన్‌ చొరవతో ఆలూరు, పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాల్లోని చెరువులకు నీరు నింపి సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారని తెలిపారు. వైసిపి నాయకులు గోవర్ధన్‌ యాదవ్‌, శ్రీధర్‌, తిరుమలేష్‌, చిన్న పెద్దయ్య, సతీష్‌ పాల్గొన్నారు.