May 17,2023 22:36

గ్రామసభలో మాట్లాడుతున్న జెసి

ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాధించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌. చేతన్‌ పేర్కొన్నారు బుధవారం మండలంలోని తంగేకుంట గ్రామంలో సోత్రీయం భూమలు రైతు వారి పట్టాల సంబంధించి గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 180 దరఖాస్తుల్లో 50అప్రూవల్‌ అయ్యాయని చెప్పారు. మిగిలిన కూడా త్వరలో అప్లోడ్‌ చేసి పట్టాలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఎవరైనా రైతులు రైతు వారి పట్టాల కోసం దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీధర్‌, ఆర్‌ఐ నాగేంద్ర, సర్పంచి అబీద, వీఆర్వో సుధాకర్‌, రఫిక్‌, తదితరులు పాల్గొన్నారు.