Sep 28,2023 22:02

దున్నేసిన వేరుశనగ మొక్కలు

     ఉరవకొండ : జిల్లాలో వర్షాభావం రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. వేరుశనగ పంట సాగు చేసి రెండు నెలలు గడుస్తున్నా సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంట చేతికి అందని పరిస్థితి తెలిసింది. దీంతో రైతులు పంటను అర్ధాంతరంగానే తొలగించేస్తున్నారు. ఇలాంటి ఘటనే విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో చోటు చేసుకుంది. చీకలగురికి గ్రామానికి చెందిన మహిళా రైతు పార్వతమ్మ తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో వేరుశనగ పంట సాగు చేసింది. సకాలంలో వర్షాలు రాక పంట మొత్తం ఎండిపోయింది. పంట చేతికందదన్న ఉద్ధేశంతో గురువారం నాడు ట్రాక్టర్‌తో 8 ఎకరాలనూ ట్రాక్టర్‌తో దున్నేసింది. దాదాపు నాలుగు లక్షలు పంట కోసం ఖర్చు చేశానని, ఇందంతా నష్టపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకైన మేత దొరుకుతుందన్న ఉద్దేశంతో పంటను తొలగించానని చెప్పారు.