Jul 29,2023 19:53

విజయమనోహరిని అభినందిస్తున్న ఎమ్మెల్యేలు

ప్రజాశక్తి - మంత్రాలయం
రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని మంత్రాలయం, ఆదోని ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి వై.సాయిప్రసాద్‌ రెడ్డి కెడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ ఎస్వీ.విజయమనోహరిని కోరారు. శనివారం కర్నూలులో ఆమెను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారని, రైతులకు అందించే రుణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తెలిపారు. అంతకుముందు ఛైర్మన్‌గా ఎంపికైనందుకు ఎమ్మెల్యేలకు ఛైర్మన్‌ విజయమనోహరి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌ రెడ్డి మిఠాయిలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్వీ సుబ్బారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యేలు
మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డిని ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, వై.సాయిప్రసాద్‌ రెడ్డి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎస్వీ.సుబ్బారెడ్డిని కర్నూలులో కలిసి ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒత్తిడికి లోను కాకుండా ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. నాడు ఎన్‌టి.రామారావు స్థాపించిన టిడిపిలో కీలక పాత్ర వహించిన ఎస్వీ.సుబ్బారెడ్డి రాంపురం రెడ్డి సోదరులతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి ఉన్నారు.

సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు
సుబ్బారెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు