టి.నరసాపురం:రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని మధ్యాహ్నపువారిగూడెం సొసైటీ ఛైర్‌పర్సన్ దాసరి రాంబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక సొసైటీ ఆవరణలో ఛైర్‌పర్సన్ రాంబాబు అధ్యక్షతన మహా జనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సౌకర్యార్థం తిరుమలదేవిపేటలో 500 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మించినట్లు ఆయన తెలిపారు. అనంతరం సిఇఒ జి.బుజంగ రావు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కార్యక్రమంలో పర్సన్లు వరికూటి సత్యనారాయణ, పిఎస్‌ఎన్ వి.సత్యనారాయణ, పలువురు రైతులు పాల్గొన్నారు.










