Oct 03,2023 22:12

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికసంఘాల నాయకులు

ప్రజాశక్తి - బెలగాం/సాలూరు/బలిజిపేట/పాలకొండ : కేంద్రంలోని బిజెపి నిరసన పాలనకు నిరసనగా ఎస్‌కెఎం, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద, సాలూరు, పాలకొండ, బలిజిపేటలో ధర్నా జరిగింది. దేశంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని, ఉత్తరప్రదేశ్‌లో నలుగురు రైతుల హత్యకు కారణమైన కేంద్ర సహా హౌం మంత్రి కుమారుడును శిక్షించి, మంత్రిని కేంద్ర మంత్రి మండలి నుంచి స్పెండ్‌ చేయాలని, డిమాండ్‌ చేస్తూ, ఈనెల3న బ్లాక్‌ డేగా పాటిస్తూ, కేంద్ర కిసాన్‌ మోర్చా కార్మిక సంఘాలు ఈరోజు పిలుపులో భాగంగా కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు వరాలు ప్రకటించి, రైతాంగానికి నోట్లో మట్టి కొట్టాలని చూస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. 385 రోజులు దేశమంతా చూస్తుండగా, ఢిల్లీ వేదికగా రైతాంగం పోరాడారని, ఇవేవీ కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని, దేశానికి అన్నం పెట్టే రైతాంగ ప్రయోజనాలు కన్నా, ప్రధాని మోడీకి అదానీ, అంబానీల ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. రైతు కొనుకూల చట్టాలు చేయనందునే, నేడు బ్లాక్‌డేగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమం లో రైతు నాయకులు రెడ్డి లక్ష్మణనాయుడు, రైతు కూలీ సంఘం సహాయకార్యదర్శి ఎం.భాస్కరరావు, ఎపి రైతు సంఘం నాయకులు కె.రామినాయుడు, పి.సంఘం, ఆర్‌.ఈశ్వరరావు, సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ, నాయకులు బి.సూరిబాబు, కె.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. సాలూరురూరల్‌ : కేంద్ర కిసాన్‌ మోర్చా కార్మిక సంఘాలు ఈరోజు పిలుపులో భాగంగా మండలంలోని తోణాంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు ఆధ్వర్యాన జరిగిన ఆందోళనలో రైతు నాయకులు కోనేటి శుభ, కృష్ణ, సుబ్బారావు, సింహాచలం పాల్గొన్నారు. పాలకొండ : స్థానిక రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఆవరణం వద్ద సంయుక్త కిషాన్‌ మోర్చా-కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ బంటు దాసు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, అభ్యుదయ రైతు సీనియర్‌ రైతు సంఘ నాయకులు ఖండా ప్రసాద్‌ రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దూసి దుర్గారావు మాట్లాడారు. కార్యక్రమంలో భవనిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధి పెదగాడ రమణ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు మునుకోటి అప్పన్న, వారాడ గోవిందరావు, మజ్జి వీరానాయుడు, సిహెచ్‌ సంజీవి, బి.పట్టాబి, బంటు శివున్నాయుడు, గౌరినాయుడు, కూర్మారావు, సింహాచలం, గొట్టాపు కృష్ణారావు, శంకరరావు పాల్గొన్నారు. కొమరాడ : సంయుక్త కిసాన్‌ మొర్చా , రైతు, కార్మిక సంఘాలపిలుపు మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ సెంటర్‌ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఏ ఉపేంద్ర మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ కొల్లి సాంబమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం మండల నాయకులు రైతులు కార్మికులు పాల్గొన్నారు. బలిజిపే :ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బలిజిపేట మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు గేదెలు సత్యనారాయణ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, రైతు కూలి సంఘం నాయకులు మామిడి సింహాద్రి నాయుడు, సిఐటియు రాజు, సత్యం, శ్రీను, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు