Jun 23,2023 22:04

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - సోమందేపల్లి : అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వేరుశనగ నాణ్యంగా ఇవ్వాలని, ప్రభుత్వం పట్టు రైతులుకు అందిస్తున్న ఇన్సెంటివ్‌ ను అందజేయాలని ఎపి రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎఒ కవితారాణికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పరిస్థితి దుర్భరగా తయారైందన్నారు. ప్రభుత్వం రైతులకు రసాయనక ఎరువులను సబ్సిడీతో అందజేయాలన్నారు. రైతు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలన్నారు. రైతులకు అన్ని రకాల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు హరి, జంగాలపల్లి పెద్దన్న, భాస్కర్‌, హనుమంత్‌ రెడ్డి, సత్యనారాయణ, రాజగోపాల్‌, చాంద్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.