Jun 21,2023 22:24

స్థానిక అధికారులతో మాట్లాడుతున్న రైల్వే అధికారులు

హిందూపురం : పట్టణంలోని రైల్వేటేషన్‌ను రైల్వే శాఖ హుబ్లీ డివిజన్‌ జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిషోర్‌, బెంగళూరు డివిజన్‌ డిఆర్‌ఎం శామ్‌ సింగ్‌ బుధవారం తనిఖీ చేశారు. హిందూపురం రైల్వేస్టేషన్‌ ప్రయాణికులకు అందుతున్న సేవలు, ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే అధికారులు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. హిందూపురం రైల్వే స్టేషన్‌ లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్‌ డిసిఎం, స్థానిక స్టేషన్‌ మాస్టర్‌తో పాటు అధికారులు సోమప్ప, శ్రీకాంత్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.