Aug 05,2023 19:16

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - కోసిగి
రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తోందా లేక రాజారెడ్డి రాజ్యం నడుస్తుందో అర్థం కావడం లేదని టిడిపి మండల అధ్యక్షులు జ్ఞానేశ్‌, జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పెండ్యాల భరద్వాజ శెట్టి, సీనియర్‌ వాల్మీకి నాయకులు వక్రాని వెంకటేష్‌, మైనారిటీ రాష్ట్ర నాయకులు ఉమర్‌ విమర్శించారు. శనివారం స్థానిక బీరప్ప దేవాలయంలో టిడిపి మంత్రాలయం ఇన్‌ఛార్జీ తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి హేయమని తెలిపారు. చంద్రబాబు నాయుడు సభలకు ప్రజల నుంచి వచ్చే స్పందనను చూసి ఓర్వలేక వైసిపి నాయకులు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ భయపడరని, ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ దాడులకు వైసిపి నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టుల గురించి సమాధానం చెప్పలేక, అభివృద్ధి చేయడం చేతకాక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. టిడిపి నాయకులు కప్పయ్య, డీలర్‌ నర్సన్న, గుండేష్‌, లక్ష్మయ్య, రణ తిక్కన్న, లక్ష్మీకాంత్‌, గోపాల్‌, ఐ టిడిపి పరుసాని హనుమంతు, ఎంపిటిసి రాజు, నరసింహులు, మైనారిటీ నాయకులు టంకం గౌస్‌, కలందర్‌, నూర్‌ బాషా, ఖాజా, మహబూబ్‌, జీలాన్‌ పాల్గొన్నారు.