Aug 22,2023 19:36

మీనాక్షినాయుడును కలిసిన గెలిచిన వార్డు మెంబర్లు

ప్రజాశక్తి - ఆదోని
వైసిపి పాలన పట్ల ప్రజలు విసిగి వేసారి పోయారని, రాష్ట్రంలో అధికార మార్పు తథ్యమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. మండలంలోని పెద్దతుంబలం, బసాపురం వార్డు మెంబర్ల ఎన్నికల్లో టిడిపి బలపరిచిన జ్యోతమ్మ, బుడగజంగాల అంజనయ్య విజయం సాధించడంతో మంగళవారం ఆదోనిలోని నివాసంలో మీనాక్షి నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. విజయానికి కృషి చేసిన రెండు గ్రామాల ఓటర్లకు, టిడిపి నాయకులకు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా టిడిపి విజయానికి కృషి చేయాలని కోరారు. ఎల్‌ఎల్‌సి మాజీ ఛైర్మన్‌ రామస్వామి, సత్యన్న, ఆరెకల్‌ రామకృష్ణ, రమణ, రుద్రయ్య, పరుశ, సుధాకర్‌, అన్వర్‌ బాష, షరీఫ్‌, నాగరాజ్‌, రామ్‌ రెడ్డి, వీరేష్‌, బసవరాజు, శ్రీదేవి, కాశీమయ్య, నర్సా, గౌస్‌, ఎల్లప్ప పాల్గొన్నారు.