Oct 26,2023 21:14

శ్రీకాళహస్తిలో స్వాగతం పలుకుతూ...


రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాడదాం..!
నాలుగున్నరేళ్లలో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.?
ఎండుతున్న పొలాలకు నీళ్లివ్వండి
'నిజం గెలవాలి' సభలో నారా భువనేశ్వరి
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, తిరుపతి టౌన్‌
'రాష్ట్ర అభివద్ధి కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. వైసిపి పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా.. నిర్బంధాలతో భయపెట్టడం కాదు.. ముందు ఎండుతున్న పొలాలకు నీళ్లివ్వండి' అని నారా భువనేశ్వరి అన్నారు. ప్రభుత్వ దష్టి చంద్రబాబు రాసిన లేఖపై కాదని, అభివద్ధిపై పెట్టాలన్నారు. 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రెండో రోజు తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం భువనేశ్వరి ప్రసంగించారు. ''మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్వామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని..కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం నాలుగు దిక్కులయ్యాం. చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయింది. మనవడు దేవాన్ష్‌ ను చూడక 48 రోజులు అయింది. తిరుపతిని ఎన్టీఆర్‌ ఎలా అభివద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో నిత్యాన్నదానాన్ని ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు. తర్వాత చంద్రబాబునాయుడు కూడా తిరుపతిని అభివద్ధి చేశారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక రంగాన్ని అభివద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లాను ఆటోమెబైల్‌ హబ్‌ గా మార్చారు. చిత్తూరు జిల్లాను ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ హబ్‌ గా తీర్చిదిద్దారు. గతంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్లో ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ రాష్ట్రం నుండి వెళ్లిపోయాయి. మన రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. మన రాష్ట్ర యువతకు రావాల్సిన ఉద్యోగాలన్నీ పక్క రాష్ట్రాల యువతకు పోతున్నాయి. అమర్‌ రాజా బ్యాటరీస్‌ ఈ జిల్లాలో 30 ఏళ్లుగా ఉంది..వాళ్లనూ ఇబ్బందులు పెట్టారు. రూ.9,300 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టారు..దీంతో అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఎస్వీ యూనివర్సిటీలో స్టూడెంట్‌ లీడర్‌ గా ప్రారంభించారు. ఆయన అరెస్టును నిరసిస్తూ యూనివర్సిటీలో ఆయన అభివమానులు దిష్టిబొమ్మను దహనం చేస్తే హత్యాయత్నం కేసులు పెట్టారు. జనసేన మహిళా నాయకలు మీడియాతో మాట్లాడితే కేసులు పెట్టారు. శ్రీకాళహస్తిలో దీక్షలు చేస్తే కేసులు పెట్టారు. ఇదా రాష్ట్ర గొప్పతనం.? మన రాష్ట్రం ఎలా అవుతుందో...భవిష్యత్‌ ఏంటో అంతా ఆలోచించాలి. నా పోరాటంలో మహాత్మ గుర్తొస్తున్నారు. ఆయన స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు.. మనం ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నాం. ఎన్టీఆర్‌ ఇచ్చిన పౌరుషంతో, చంద్రబాబు ఇచ్చిన క్రమశిక్షణతో పోరాడుదాం.'' అని భువనేశ్వరి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్సీ అనురాధ, టిడిపి మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి, తిరుపతి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ సుగుణమ్మ, టిడిపి తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షులు నరసింహ యాదవ్‌, టిడిపి నగర అధ్యక్షులు చిన్నబాబు, టిడిపి మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్‌ యాదవ్‌, టిడిపి కార్పొరేటర్‌ ఆర్సి మునికష్ణ, టౌన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ పులిగోరు మురళీకష్ణ రెడ్డి, నాయకులు ఊక విజరు కుమార్‌, ఆంబూరు సింధూజ, పుష్పావతి, జనసేన నాయకులు కిరణ్‌ రాయలు రాజారెడ్డి పాల్గొన్నారు
బాధిత కుటుంబాలకు అండగా....
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి/తొట్టంబేడు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన గురువారం ఆమె తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తీవ్ర మనోవేదనకు గురై మతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెంలో మోడెం వెంకట్రమణ, కొణతనేరిలో గాలి సుధాకర్‌, కాసరంలో పరుచూరి వెంకట సుబ్బయ్య గౌడ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఒక్కొక్కరికి రూ.3లక్షల వంతున ఆర్థిక సాయం చెక్‌ రూపంలో అందజేశారు. చంద్రబాబు సూచనలతో తాను క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ బాధిత కుటుంబాలకు సాయం చేస్తున్నానని తెలిపారు. అంతకు మునుపు నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్‌ కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్‌ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీనాయుడు, సత్రవాడ మునిరామయ్య, బొజ్జల బందమ్మ, బొజ్జల రిషితారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, మండల అధ్యక్షులు గాలి మురళినాయుడు, రావిళ్ల మునిరాజా నాయుడు, చెంచయ్యనాయుడు, టీడీపీ నేతలు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, చల్లా బాబు, గాలి భానుప్రకాశ్‌, నరసింహ యాదవ్‌, చక్రాల ఉష, గుడ్లూరి మోహన్‌ కిషోర్‌ నాయుడు, డాక్టర్‌ పోతుగుంట రాజేష్‌, ఎస్సీవీ దిలీప్‌, సత్రవాడ ప్రవీణ్‌, బాలాజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో స్వాగతం పలుకుతూ...