Sep 11,2023 20:37

    కైకలూరు : రహదారి ప్రమాదంలో రామకృష్ణ మృతి చెందడం బాధాకరమని ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ తెలిపారు. సోమవారం మండలంలోని గోపవరంలో పంతగాని రంగారావు కుమారుడు రామకృష్ణ(45) ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి వారి పార్థీవ దేహానికి పూలుమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.